
తెలుగు లో అంటే సుందరానికీ చిత్రంతో నజ్రియా ఫాహద్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అయినప్పటికీ తన మొదటి సినిమాతోనే తెలుగు లో డబ్బింగ్ చెప్పి అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. జూన్ 10న విడుదల చేయబోతున్నామని ఇంతకముందే చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా హీరోయిన్ నజ్రియా ఫాహద్‌తో డబ్బింగ్‌ను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి చేయించాడు.
దర్శకుడు వివేక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసి.. ‘నేడు నేను అంటే సుందరానికీ! సినిమా డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ మూవీని ఓ అద్బుతమైన వ్యక్తి తెరకెక్కించాడు. అతను ఇప్పుడు నాకు మంచి స్నేహితుడు కూడా’.. అంటూ నజ్రియా తెలిపింది. ఇక ఈ మూవీ లో నాని డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.
