
అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దునియా విజయ్ విలన్ గా నటిస్తుంటే, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ముందు అనుకున్నట్లుగా దసరా నాటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేదట. బాలయ్యకి కరోనా వచ్చి షూటింగ్ కి బ్రేక్ పడడం, అమెరికాలో జరగాల్సిన షూటింగ్ వీసా కారణంగా టర్కీకి షిఫ్ట్ చేయడం ఇలా పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతోంది. అయితే ఇప్పుడు రిలీజ్ విషయంలో ‘అఖండ’ సెంటిమెంట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలోనే ‘అఖండ’ సినిమా విడుదలైన రోజున డిసెంబర్ 2నే ఈ సినిమాను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అఫీషియల్ గా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని సైతం ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇదే నిజమై బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డట్లే …
