Site icon TeluguMirchi.com

నాగచైతన్య 22 వ చిత్రం ప్రకటన

లవ్ స్టోరీ , బంగార్రాజు చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య..ఈరోజు తన 22 వ చిత్రాన్ని ప్రకటించారు. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతుందట. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి. కాగా కమర్షియల్ హంగులతో కూడిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని దర్శకుడు చైతన్య కోసం రెడీ చేశాడని అంటున్నారు.

ప్రస్తుతం చైతు “థ్యాంక్యూ” షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసాడు. మరోవైపు “థ్యాంక్యూ” డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే తన ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. “దూత” పేరుతో ఓటిటి సిరీస్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు.

Exit mobile version