Site icon TeluguMirchi.com

గవర్నమెంట్ అధికారి కొడుకుతో నిహారిక వివాహం ..?

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. దీంతో తన పద్దతిని మార్చేసి గ్లామర్ యాంగిల్ లో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా లో తనలోని హాట్ నెస్ ని బయట పెట్టడం స్టార్ట్ చేసి ఆకట్టుకోగా..తాజాగా తనకు కాబోయే వ్యక్తి ని చూపించింది.

తన సోషల్ మీడియా పేజీలో సదరు వ్యక్తి ని చూపించింది. కాకపోతే పేస్ మాత్రం కనిపించకుండా గట్టి హగ్ ఇచ్చి కవర్ చేసింది. ఆమె గుంటూరుకు చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకుని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వార్త ను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ మెగా వర్గాలు మాత్రం ఇది నిజమే అని చెపుతున్నారు.

Exit mobile version