
మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. దీంతో తన పద్దతిని మార్చేసి గ్లామర్ యాంగిల్ లో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా లో తనలోని హాట్ నెస్ ని బయట పెట్టడం స్టార్ట్ చేసి ఆకట్టుకోగా..తాజాగా ఈమె పెళ్లికి సిద్దమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిహారిక తాజాగా తన పోస్ట్‌తో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు హింట్ ఇచ్చింది. కప్‌పై ఉన్న మిస్ నిహా పేరులో మిస్‌ని కట్ చేసి మిస్సెస్ అని రాసింది నిహారిక. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం నాగబాబు.. నిహారికాకి ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నాం. దాదాపు వచ్చే ఏడాది మొదటిలోనే ఆమె పెళ్లిని జరిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ వెంటనే వరుణ్ తేజ్‌కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే త్వరలోనే నిహారిక ఓ ఇంటిది కావడం ఖాయం గా కనిపిస్తుంది.
