
తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు. యువకుడు చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ భామ తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఈమె కెరియర్ లో తెలుగులో ఖుషి , మిస్సమ్మ , సింహాద్రి , ఒక్కడు , వాసు వంటి చిత్రాలు మంచి గుర్తింపు ఇచ్చాయి.
ఈ మధ్యనే బాలకృష్ణ రూలర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే ఈమె అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు యంగ్ హీరో నిఖిల్. తాజాగా అభిమానులతో ముచ్చటించిన నిఖిల్ ..వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపాడు. అందులో మీకు ఇష్టమైన వెబ్ సిరీస్? అని అడగగా.. ‘నాకు గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ అంటే బాగా ఇష్టం అని తెలిపారు. మరి మీకిష్టమైన నటి ? అంటే.. ‘భూమిక. ‘ఖుషి’లో ఆమె చక్కగా ఉంటారు, బాగా నటించారు’ అని తెలిపాడు.
