
రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తుండగా.. అంబిక ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాగ్ రిలీజ్ చేసి సినిమా ఫై క్రేజ్ తీసుకురాగా..ఈ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘కింగ్ అక్కినేని నాగార్జునగారి సినిమా టైటిల్‌తో వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా చిత్ర టైటిల్‌ను కూడా ఆయనే విడుదల చేసి, మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. అమన్, సిద్ధిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ తదితరులు నటించారు. ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. షూటింగ్‌కు సంబంధించి చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఇంతకు ముందు విడుదల చేసిన తొలి లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర రెండో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశాము. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా, చిన్మయి ఆలపించారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ మా టీమ్‌కు శుభాకాంక్షలు తెలపడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వైకుంఠ బోను చాలా చక్కగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది..” అని తెలిపారు.
