Site icon TeluguMirchi.com

ఇస్మార్ట్ బ్యూటీ తో నితిన్ రొమాన్స్..

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు వెంకీ కుడుముల భీష్మ చిత్రం ఇచ్చి ఊపిరి పోసాడు. నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నితిన్.. బాలీవుడ్ మూవీ అందదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు గాను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఒరిజినల్ వర్షన్ లో నటించిన టబు పాత్రకు గాను రమ్యకృష్ణ ను ఎంపిక చేశారట. ఇక హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి డైరెక్టర్.

Exit mobile version