
వెండితెర ఛాన్సులు రాకపోయినప్పటికీ…వెబ్ సిరీస్ ఛాన్స్ కొట్టేసింది నిత్యామీనన్ . తాజాగా అభిషేక్ బచ్చన్ తో కలిసి ‘బ్రీత్ : ఇన్ టు దీ షాడోస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ఈ సిరీస్ మొదటి సీజన్ ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు రెండో సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిషేక్ విడుదల చేశారు.
తను నీడలో ఉంటూ కావాల్సిన దాని కోసం ఎదురుచూస్తోంది. ‘బ్రీత్ : ఇన్ టు దిషాడోస్’ అని పోస్టు పెట్టారు. జులై 10న ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందులో అమిత్ సాద్, సయామీ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
