Site icon TeluguMirchi.com

సర్కారు లో ఈమెకూడానా ..?

మహేష్ – పరశురామ్ కలయికలో తెరకెక్కబోయే చిత్రం సర్కారు వారి పాట. కృష్ణ బర్త్ డే సందర్భాంగా ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వలన.. షూటింగ్స్ కి అనుమతి లభించినా కొన్ని రోజుల సమయం తీసుకునే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

ఇదిలా ఉంటె ఈ చిత్రంలో హిరోయిన్‌గా కీర్తీ సురేష్‌ నటించనున్నట్లు ఆమెనే స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కు కూడా స్కోప్‌ ఉందట. ఆ పాత్ర కోసం తమిళ నటి నివేద థామస్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని, అన్ని కుదిరితే సర్కారువారి పాటలో నివేద థామస్‌ను కూడా చూడవచ్చు అని అంటున్నారు.

Exit mobile version