Site icon TeluguMirchi.com

ఈ ఏడాది మహేష్ నుండి మరో సినిమా లేనట్లే

ఈ ఏడాది సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు..ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే చిత్రం చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. షూటింగ్ లకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయితే రిస్క్ అవసరం లేదు. డిసెంబర్ తర్వాతే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ని మొదలెడదామని మహేష్ అన్నట్టు తెలిసింది. దీనిబట్టి చూస్తే ఈ ఏడాది మహేష్ నుండి మరో సినిమా రానట్లే.

Exit mobile version