
కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో ఎన్టీఆర్ 30 మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబదించిన క్రేజీ అప్డేట్ ను మీడియా తో పంచుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ , చరణ్ ల కలయికలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ఈ తరుణంలో చిత్ర సక్సెస్ ను మీడియా తో పంచుకున్న ఎన్టీఆర్..తన నెక్స్ట్ మూవీ ఫై క్లారిటీ ఇచ్చారు.
జూన్ నెలలో కొరటాల శివ తో తన 30 వ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్లు తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకుంటాడట. అలాగే ఆచార్య సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే నెలలో ఆచార్య సినిమా విడుదల అయిన తర్వాత కొరటాల శివ పూర్తిగా ఫ్రీ అవుతాడు. అందుకే జూన్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారట.
