Site icon TeluguMirchi.com

చరణ్ – ఎన్టీఆర్ లు కూడా అదే డిసైడ్ అయ్యారట..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భాంగా చరణ్ తాలూకా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు. అయితే లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్ లు బంద్ అయినా సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో హైదరాబాద్ వేదికగా ఓ భారీ సెట్ ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్.

సెట్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. దీనికి కారణం హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనానే. అతి తక్కువమంది పాల్గొన్న బుల్లి తెర సీరియల్స్ నటులకే ఈ వ్యాధి సోకడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లాంటి మూవీ షూటింగ్ ఎంత పరిమితులకు లోబడి నిర్వహించినా రిస్క్ ఎక్కువని భావిస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళికి ఏమీ పాలుపోక కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. ఐతే ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేరని తాజా సమాచారం. మహమ్మారి వ్యాప్తి చెందుతున్న వేళా… షూటింగ్ లో పాల్గొనడం అంత సేఫ్ కాదనేది వారి ఆలోచన. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పట్లో మొదలు కాదని పక్కాగా తెలుస్తుంది.

Exit mobile version