Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ లాక్ డౌన్ లో ఏంచేస్తున్నాడో..ఏం నేర్పిస్తున్నాడో తెలుసా..?

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు బంద్ కావడం తో సినీ తారలకు ఎన్నడూ లేని విధంగా బ్రేక్ లభించింది. దీంతో వారి ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఎవరికీ నచ్చింది వారు చేస్తూ టైం పాస్ చేస్తుండగా..ఎన్టీఆర్ మాత్రం తన భార్య పిల్లలతో హ్యాపీగా గడిపేస్తున్నాడు.

వంటలో ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం స్వయంగా రుచికరమైన వంటకాలు చేస్తున్నాడట. అలాగే కొడుకులు అభిరామ్ మరియు భార్గవ్ రామ్ లకు తెలుగులో శిక్షణ ఇస్తున్నాడట. అలాగే వారి తాతగారైన తారకరామారావు గారి సినిమాలను వారితో కలిసి చూస్తూ ఆస్వాదిస్తున్నాడట. ఇలా అధ్బుతమైన ఫ్యామిలీ లైఫ్ ఆయన అనుభవిస్తున్నాడని సమాచారం.

Exit mobile version