Site icon TeluguMirchi.com

అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి ఎన్టీఆర్ మూవీ ..

అల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా..త్వరలో షూటింగ్ మొదలుపెట్టుకుంది.

Exit mobile version