Site icon TeluguMirchi.com

ఓంకార్ కు కరోనా ..?

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది.

ఇప్పటికే సీరియల్ నటుడు ప్రభాకర్, హరికృష్ణ లు కరోనా బారిన పడగా..తాజాగా డైరెక్టర్ & యాంకర్ ఓంకార్ కు కరోనా వచ్చిందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆ వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఓంకార్ కి కరోనా రాలేదని కేవలం టెస్ట్ మాత్రమే చేయించుకున్నాడని తెలిపారు. రిపోర్ట్స్ లో నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. సోమవారం నుండి ఆయన షూటింగ్ లో సైతం పాల్గొంటారని అన్నారు.

Exit mobile version