Site icon TeluguMirchi.com

ఓటిటి లోకి సిద్దమైన సినిమాలు ఇవేనా..?

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని గత మూడు నెలలుగా మూతపడ్డాయి. ఇవి ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో కోట్లు పెట్టి నిర్మించిన సినిమాలు ల్యాబ్ కే పరిమితమయ్యాయి. ఇలా ఎన్ని రోజులు ల్యాబ్ లో ఉంటాయని నిర్మాతలు ఓటిటి వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేయగా…వీటి బాటలోనే మరికొన్ని తెలుగు , తమిళ్ మొదలగు భాషల చిత్రాలు సిద్దమవుతున్నాయి.

నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఓటిటి లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్దమయ్యినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version