Site icon TeluguMirchi.com

దక్షిణాది చిత్రాల్లోనే హీరోయిన్లను బాగా గౌరవిస్తారని అంటున్న పాయల్

సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లో జరుగుతున్న సంఘటనలను బయటకు తీస్తున్నారు. ఇప్పటికే పలువురు నటి నటులు ఇండస్ట్రీ లో కొంతమంది వ్యక్తులపై విమర్శలు చేయగా..తాజాగా పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రాల్లోనే హీరోయిన్లను బాగా గౌరవిస్తారని తెలిపింది. దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తుండడంతో బాలీవుడ్‌లో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు జరిపే సమయంలో దక్షిణాది సినిమాల్లో నటించానన్న విషయాన్ని చెప్పొద్దని తనకు కొందరు సలహాలు ఇచ్చారని వెల్లడించింది. ఈ పరిణామాలతో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల కోసం ప్రయత్నాలు జరపితేనే బాగుంటుందని తనకు అనిపిస్తోందని తెలిపింది.

Exit mobile version