
దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతున్నాయి. జూన్ 7 నుంచి వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
గత 12 రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు శుక్రవారం కూడా అదే విధంగా కొనసాగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.80 దాటింది. లీటర్ పెట్రోల్‌పై 59 పైసలు, లీటర్ డీజిల్‌పై 61 పైసలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.77 కాగా లీటర్ డీజిల్ ధర రూ.74.70 గా ఉంది. న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.37 కాగా, డీజిల్ ధర రూ.77.06. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.84.66 కాగా, డీజిల్ ధర రూ.74.93 గా ఉంది.
