Site icon TeluguMirchi.com

పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ..

రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ , వైసీపీ నేత పీవీపీ ఫై బంజారా హిల్స్ లో ఓ వ్యక్తి పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా..వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.

Exit mobile version