
వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.
ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన “పవర్ స్టార్” పేరిట మరో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లవ్ లీ బ్రదర్స్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసిన మూవీలోని పోస్టర్లకు అద్భుతమైన స్పందన వస్తోంది.
తాజాగా వర్మ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు మరో వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ 1998 జులై 24న విడుదలైన కెరీర్‌లో బ్లాక్‌బ్లాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే రోజు పవర్‌స్టార్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ్ల ఇదే నిజమైతే ఆర్జీవీ మరో ట్విస్ట్ ఇస్తుండటం ఖాయమనే చెప్పాలి. ఆర్జీవీ రామోజీఫిల్మ్ సిటీలో పాతబడ్డ రిసార్ట్‌ను లీజ్ కు తీసుకున్నారట. అన్ని సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు ఈ రిసార్ట్ నుంచే కొనసాగించనున్నాడట.
