
బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి ఏ రేంజ్ కు పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన రేంజ్ మాత్రమే కాదు ..ఆయన సినిమాలు సైతం బడ్జెట్ పెరిగాయి. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడం తో దీని బడ్జెట్ ను భారీ గా ప్లాన్ చేసారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కు దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ నటి నటులను ఈ చిత్రానికి గాను ఎంపిక చేస్తున్నారట. మొత్తం మీద ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు.
