
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ , రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టుకొని చాల నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమా తాలూకా ఎలాంటి అప్డేట్ అధికారికంగా ప్రకటించకపోయేసరికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదిగా యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేసారు. వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కాస్త హడావుడి కూడా చేసారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఏమాత్రం స్పందించలేదు. దీంతో అభిమానులే సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసుకొని సోషల్ మీడియా లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ప్రచారం స్టార్ట్ చేసారు. అయితే ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. ముందుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి… ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
