Site icon TeluguMirchi.com

ప్రభాస్ స్టిల్ వచ్చేస్తుంది..

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ , రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టుకొని చాల నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమా తాలూకా ఎలాంటి అప్డేట్ అధికారికంగా ప్రకటించకపోయేసరికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదిగా యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేసారు. వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కాస్త హడావుడి కూడా చేసారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఏమాత్రం స్పందించలేదు. అయితే నిజానికి ఇటీవల విడుదలచేయాలనే ఆలోచనతో ఓ స్టిల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కానీ అదే సమయంలో బాలీవుడ్ లో సుశాంత్ మరణం సంభవించడంతో ఆగిపోయారని బోగట్టా. అందువల్ల మరో డేట్ చేసి విడుదల చేయాలని అనుకంటున్నట్లు తెలుస్తోంది.

బహుశా 22న లేదా కాస్త అటు ఇటుగా ప్రభాస్ లుక్ వస్తుందని తెలుస్తోంది. ఈ లుక్ తో పాటే టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా వుండొచ్చని బోగట్టా.

Exit mobile version