
వూల్ఫ్ టీజర్‌ను గమనిస్తుంటే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవాలు సరికొత్త లుక్ లో కనిపించారు. టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి.
వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు నటించిన ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
