
లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో డిజిటల్ మీడియా కు ఫుల్ క్రేజ్ వచ్చింది. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా నటి నటులంతా డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో విలక్షణ నటుడిగా గుర్తింపు ఉన్న ప్రకాష్ రాజ్ సైతం డిజిటల్ మీడియా ఫై కన్నేసినట్లు తెలుస్తుంది. దక్షిణాది సహా ఉత్తరాది ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించిన ప్రకాశ్‌రాజ్ వెబ్ సిరీస్‌లో మొదటిసారి నటిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని సమాచారం. నటుడిగానే కాకుండా ప్రకాశ్‌రాజ్ కథా రచనలోనూ ప్రకాశ్‌రాజ్ తన వంతు సహకారాన్ని అందించారట. రీసెంట్‌గా జరిగిన నిజ ఘటనలను ఆధారం చేసుకుని ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారట. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది.
