
‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన కన్నడ బ్యూటీ ప్రణీత .. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘బావ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ప్రణీత పాపులర్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, పవన్ సరసన నటించడం ఛాన్సులు ఓ రేంజ్ లో వస్తాయని కలలు కన్నది కానీ అమ్మడు అనుకున్నది ఒకటి అయ్యింది మరోటి. ఈ సినిమా తరవాత ప్రణీత నటించిన ఏ చిత్రం పెద్దగా ఆడలేదు. కిందటేడాది ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమాలో కృష్ణకుమారిగా ప్రణీత కనిపించింది.
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ ఆదివారం సాయంత్రం ప్రణీత ట్విట్టర్ ద్వారా అభిమానులను పలకరించింది. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ తన అభిమాన నటుడు అని ప్రణీత చెప్పింది. అలాగే, టాలీవుడ్‌లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని వెల్లడించింది. మహేష్ బాబు గురించి ఒక్క పదంలో చెప్పమంటే ‘హ్యాండ్‌సమ్’ అని బదులిచ్చింది.
Pawan Kalyan and Ajay Devgan ? #AskPranitha https://t.co/m983wbnysM
— Pranitha Subhash (@pranitasubhash) July 5, 2020
