Site icon TeluguMirchi.com

టెన్షన్ లో పడేసిన ప్రశాంత్ నీల్..

కేజీఎఫ్‌..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేయగా ..యష్ హీరోగా నటించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎదో జరగబోతుంది…మీరు అదేమిటో ఊహిస్తూ ఉండండి అని, ఆయన రెండు ఫోటోలు పంచుకున్నారు. ఆ రెండు ఫోటోలలో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. వీరిద్దరిపై ఓ వీడియో చిత్రీకరిస్తున్నట్లు ఉండగా ఆ వీడియో దేని గురించి అయ్యుంటుందని ఆసక్తి రేపుతోంది. యష్ మరియు ప్రశాంత్ నీల్ ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తున్నారా..లేక మూవీ సంగతులు తెలుపుతూ వీడియో చేస్తున్నారా.. అనేది అర్ధం కావడం లేదు. మొత్తం మీద ప్రశాంత్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చ గా మారింది.

Exit mobile version