Site icon TeluguMirchi.com

నాంది లో ప్రవీణ్ లుక్

గత కొంతకాలం గా హీరోగా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న అల్లరి నరేష్ ..ప్రస్తుతం విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్‌.వి. 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మాణంలో ‘నాంది’ అనే సినిమా చేస్తున్నాడు. అల్ల‌రి న‌రేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటుంది.

లేటెస్టుగా జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయబోతున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ”జూన్ 30 మంగళవారం – మీరందరూ ‘నాంది’ యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి” అంటూ ట్వీట్ చేయగా..తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవీణ్ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటివరకు కామెడీ క్యారెక్టర్లతో అలరించిన ప్రవీణ్ తొలిసారిగా ఈ మూవీలో సంతోష్ అనే ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version