Site icon TeluguMirchi.com

ప్రీతీ హిమాచలి గెటప్ ..

ప్రేమంటే ఇదేరా , రాజకుమారుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడింది. ఈ భామ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా.

తాజాగా హిమాచలి సంప్రదాయ గెటప్ లో కనిపించి ఆశ్చర్య పరిచింది. హిమాచలి సంప్రదాయ టోపీని పెట్టుకుని తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయింది. నాలో హిమాచలిని మననం చేసుకుంటున్నా.. ఎంత దూరం, ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా..మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది మర్చిపోకూడదని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. #himachali, #pahadi అనే హ్యాష్ ట్యాగ్ లను జతచేసింది.

Exit mobile version