
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ తొలి భాగం తెలుగులో అంతగా ప్రేక్షకాదరణ పొందకున్న కూడా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. రెండో భాగం టీజర్ ను ఇవాళ లైకా ప్రొడక్షన్ విడుదల చేసింది. ఈ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. వచ్చే ఏడాది వేసవికి అంటే ఏప్రిల్ 28న రెండో భాగాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. కొత్త టీజర్‌లో విక్రమ్, జయం రవి, కార్తి పాల్గొన్న విజువల్స్ ఉన్నాయి. తొలి భాగం మంచి ఆసక్తి కల్గిస్తూ ముగించడంతో… రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయిన ఏప్రిల్ 28 వ తేదీనే పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ గా ఎంచుకోవడం గమనార్హం.
