Site icon TeluguMirchi.com

రణవీర్ సింగ్ మూవీ సెట్ లో సందడి చేసిన పూరి , ఛార్మి

డాషింగ్ డైరెక్టర్ పూరి పూర్తిగా ముంబై లోనే మకాం వేసాడు. విజయ్ దేవరకొండ తో లైగర్ మూవీ కోసం ముంబై కి వెళ్లిన ఆయన , ఛార్మి లు..గత కొద్దీ నెలలుగా అక్కడే ఉంటూ..బాలీవుడ్ సంబంధాలు పెంచుకుంటున్నారు. లైగర్ చిత్రానికి కరణ్ జోహార్ కూడా మరో నిర్మాత కావడం తో వీరి మధ్య స్నేహం ఇంకాస్త పెరిగింది. కరణ్ కు బాలీవుడ్ సంబధాలు ఎక్కువగా ఉండడం తో ఆయన ద్వారా పూరి , ఛార్మీలకు మరింత పరిచయం అవుతున్నారు.

ప్రస్తుతం కరణ్ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది. దీంతో ఈ సినిమా సెట్ కి పూరి, ఛార్మిలు వెళ్లి అక్కడ కరణ్ జోహార్ తో పాటు రణవీర్ సింగ్ ని కూడా కలిశారు. కరణ్, రణవీర్ వీరికి మంచి ఆతిధ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వీరంతా కలిసి ఫోటోలు దిగారు.

ఈ ఫోటోలను ఛార్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఛార్మి రణవీర్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ”రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సెట్స్‌లో మీ ఎనర్జీ మరియు బాండింగ్ తో మా పై అద్భుతమైన వైబ్ చూపించారు రణవీర్ సింగ్. ఇక కరణ్ జోహార్ మీరు ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు” అంటూ పోస్ట్ చేసింది.

Exit mobile version