
ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ అందుకున్న పూరి..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫై కసరత్తులు చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు జనగణమన టైటిల్ తో మహేష్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. ఆ తర్వాత మళ్లీ ఏమైందో ఆ ఊసే లేదు.
ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ వార్తల్లోకి ఎక్కింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కించబోతున్నాడని..ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని, మూవీలో హీరో ఆర్మీ జవానుగా కనిపిస్తాడని అంటున్నారు. మరి నిజంగా మూవీ అలాగే తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.
