
డైరెక్టర్ పూరి ..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి కాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం కొనసాగుతుండటంతో అది సాధ్యపడదని భావించి లోకల్ ఫైటర్స్‌తో ఈ ఫైటింగ్ సీన్స్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట పూరి. ఈ మేరకు స్క్రిప్ట్‌లో భారీ మార్పులకు సిద్దంకాక తప్పలేదంటూ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అలాగే కొంత భాగం విదేశాల్లో కూడా షూట్ చేయాలనుకున్న పూరి తన నిర్ణయాన్ని మార్చుకుని పూర్తిగా హైదరాబాద్ లోనే షూట్ చేసేలా లొకేషన్స్ వేట పారంభించారట. ఈ క్రమంలో ‘ఫైటర్’ మూవీ విడుదల కూడా ఈ ఏడాది కష్టమే అని తెలుస్తోంది.
