Site icon TeluguMirchi.com

పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లడానికి టైం పడుతుందట..

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17 న మొదటి పార్ట్ విడుదలై సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా గా వచ్చిన ఈ మూవీ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో రెండో పార్ట్ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

మొన్నటి వరకు ఏప్రిల్ నెలలో షూటింగ్ మొదలు కాబోతుందని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జూన్ నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారట. మరి ముందుగా చెప్పినట్లు డిసెంబర్ నెలలో పార్ట్ 2 విడుదల చేస్తారో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version