
అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. బన్నీ 38 వ పుట్టిన రోజు సందర్భాంగా చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఐతే పుష్ప మూవీలో హీరోయిన్గా అవకాశం మొదట క్రేజీ బ్యూటీ సమంతకు దక్కిందట.
వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకున్న సమంత పుష్ప మూవీలో నటించడానికి ఆసక్తి చూపలేదట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం సమంత, బన్నీ కలిసి నటించారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మరి సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం చిత్రంలో సామ్ నటించింది. అది కూడా భారీ హిట్ కొట్టింది. మరి ఈ సినిమాకు ఎందుకు నో చెప్పిందో..
