
RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , నెటిజన్లను అలరిస్తూ వస్తుంది.
తాజాగా ప్లస్ 2 లో దిగిన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది. అప్పట్లో కాస్త బొద్దుగా ముక్కుపుడక పెట్టుకొని క్యూట్ గా ఉంది పాయల్. టీనేజ్ పాయల్ చూసిన కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ హల్చల్ చేస్తుంది.
