Site icon TeluguMirchi.com

‘రాధే శ్యామ్’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతి రావడం తో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది షూట్ ప్రారంభించిన రోజు నుంచీ సస్పెన్స్ ఉంది. తాజా అప్ డేట్ ఏమిటంటే, తమిళానికి చెందిన యువ స్వరకర్త జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ కూడా ప్రారంభించాడట.

Exit mobile version