Site icon TeluguMirchi.com

ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ లో రాజమౌళి స్టెప్స్ తో అదరగొట్టాడు

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. రెండో వారంలోను కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ తరుణంలో నిజాం డిస్ట్రబ్యూటర్ దిల్ రాజు గత రాత్రి సక్సెస్ మీట్ ఏర్పటు చేసాడు. ఈ సక్సెస్ మీట్ కే చిత్ర యూనిట్ హాజరయ్యారు.

ఈ పార్టీకి తారక్, చరణ్, రాజమౌళి, మరో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సభ్యులు, ఇతర టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో రాజమౌళి, అనిల్ రావిపూడి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి అలరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Fantastic visual from last night party hosted by Dil Raju. @tarak9999 & @AlwaysRamCharan directed while @ssrajamouli & @AnilRavipudi performed the iconic #NaatuNaatu step👌👌 pic.twitter.com/PdWs6axnNG— Shreyas Sriniwaas (@shreyasmedia) April 5, 2022

Exit mobile version