
దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటివరకు ఎప్పుడు పడని టెన్షన్ ఆర్ఆర్ఆర్ తో పడుతున్నాడు. ఏ క్షణాన ఈ మూవీ మొదలుపెట్టారో కానీ అప్పటినుండి అన్ని అవాంతరాలే..హీరోలు గాయాలు పాలవ్వడం..నటి నటులు సినిమా నుండి తప్పుకోవడం..ఆతర్వాత అన్ని సెట్ అయ్యాలే అనుకునేలోపు కరోనా రావడం ఇలా అన్ని రావడం తో సినిమా ముందుకు సాగడం లేదు.
ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్ లకు అనుమతి రావడం తో దర్శకధీరుడు రాజమౌళి కూడా RRR షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, నేరుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో షూటింగ్ మొదలుపెట్టకుండా ముందుగా రెండు రోజుల ట్రయల్ షూట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
తన టెక్నికల్ టీమ్‌తో కలిసి సోమ, మంగళవారాల్లో ఈ ట్రయల్ షూట్ చేస్తున్నారట రాజమౌళి. గండిపేట లేదంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు సిరిల్ ఆధ్వర్యంలో వేసిన సెట్‌లో సోమవారం ఈ ట్రైల్ షూట్‌ను ప్రారంభించారని సమాచారం. డూప్‌ల సాయంతో ఈ ట్రయల్ చేస్తున్నారట రాజమౌళి.
