
ఈ మధ్య సంక్రాంతి బరిలో వస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సక్సెస్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. 2021 లోను రజని నుండి సినిమా వస్తుందని అంత భావించారు కానీ ఇప్పుడు ఆ సినిమా రావడం కష్టమే అనిపిస్తుంది. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ డైరెక్షన్లో రజనీ దరువు శివ (సిరుత్తై శివ) సినిమా చేస్తున్నాడు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించనున్నారు.
ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ దేశవ్యాప్తంగా అన్ లాక్ 1.0 అమల్లో ఉన్నా.. మరోసారి తమిళ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సినిమాను ముందుగా 2021 సంక్రాంతి రిలీజ్ చేయాలనుకున్నా అది కష్టంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2021 వేసవిలో రిలీజయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.ఇప్పుడు అదికూడా కుదిరేలా లేదు. సెప్టెంబర్- అక్టోబర్ నాటికి మహమ్మారీ ఇంకా భీకరంగా విజృంభిస్తుందన్న అంచనాలున్నాయి.దాంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో .. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో .. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. చెప్పలేని పరిస్థితి నెలకొంది.
