
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో బాంబ్ పెట్టారనే వార్త అభిమానులను , చిత్ర సీమను కలవర పెట్టింది. రజనీకాంత్ ఇంటిలో ఎవరో బాంబు పెట్టారన్న సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది డాగ్ స్కాడ్ మరియు బాంబు స్కాడ్ చాల సమయం రజనీ ఇంటి ఆవరణలో వెతకడం చేసారు కానీ చివరికి అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధాలు కనిపించక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది ఎవరో ఆకతాయి చేసిన ఫ్రాంక్ కాల్ అని వారు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం రజనీకాంత్ శివ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో సంక్రాంతి బరిలో రిలీజ్ చేద్దామనుకున్న యూనిట్ ప్లాన్ రివర్స్ అయ్యింది.
