
లాక్ డౌన్ కారణంగా అనేక రంగాలు దారుణంగా నష్టపోతున్నాయి. వాటిల్లో సినెమా రంగం కూడా ఒకటి. గత మూడు నెలలుగా సినిమా థియేటర్స్ బంద్ కావడం తో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే త్వరలో థియేటర్స్ ఓపెన్ అవుతాయనే సంకేతాలు వినపడుతుండగా..ఓ ప్రముఖ థియేటర్ మాత్రం శాశ్వతంగా మూతపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చెన్నైలోని వడపలని ఏరియాలో ఉన్న ప్రముఖ ఏవీఎం రాజేశ్వరి థియేటర్‌ని మూసివేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధరణ ప్రేక్షకులకు అందుబాటులో టికెట్ ధరలను పెడుతూ.. సినీ అభిమానులకు ఫ్రెండ్లీగా ఉన్న ఈ థియేటర్‌ని శాశ్వతంగా మూసివేయాలన్న ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. చెన్నైలో సినిమాలు వీక్షించే సాధారణ ప్రేక్షకులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
