Site icon TeluguMirchi.com

రామ్ రూ.30 కోట్లు..కాస్త ఆలోచించరాదు

కరోనా వైరస్ చిత్రసీమను కోలుకోలేని దెబ్బ తీసింది. గత మూడు నెలలుగా సినిమా థియేటర్స్ బంద్ కావడం , షూటింగ్ లు బంద్ కావడం, రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతులు వచ్చినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ లలో పాల్గొనేందుకు ఎవరు ధైర్యం చేయడం లేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలూ వాటిల్లుతున్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న సినిమాల పరిస్థితి మరోలా ఉంది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో పలు భాషల్లోని చాలా మూవీలు ఆన్‌లైన్‌లో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాయి.

తాజాగా రామ్ నటిస్తున్న రెడ్ చిత్రం సైతం కరోనా కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు మేకర్లను సంప్రదించాయట. అంతేకాదు 30 కోట్ల భారీ ఆఫర్‌ని కూడా ఇచ్చాయట. అయితే ఈ ఆఫర్‌ని రామ్ టీమ్ తిరస్కరించిందట. నిదానం అయినా థియేటర్లలోనే ఈ చిత్రాన్ని తీసుకురావాలని వారు ఆలోచిస్తున్నారట.ఈ వార్త చూసిన అభిమానులు రామ్ కాస్త ఆలోచించరాదు అన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version