Site icon TeluguMirchi.com

Game Changer : ‘గేమ్‌ఛేంజ‌ర్‌’ డ‌బ్బింగ్ ప‌నులు షురూ చేసిన టీమ్

Gamechanger1


Game Changer dubbing works started : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో గేమ్ ఛేంజ‌ర్‌పై మరింత హైప్ ఏర్పడింది.

Also Read : వయనాడ్ బాధితులకు ప్రభాస్ ఆపన్నహస్తం.. రూ.2 కోట్ల విరాళం

ఈ ఏడాది క్రిస్మ‌స్ కి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్ప‌డ‌మే కాదు, ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకొస్తున్నారు నిర్మాత‌లు. తాజాగా గేమ్ ఛేంజ‌ర్ డ‌బ్బింగ్ ప‌నులు షురూ అయ్యాయి. పూజా కార్య‌క్ర‌మాల‌తో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టారు. ఆల్ సెట్ ఫ‌ర్ ద మెగా ఫైర్ వ‌ర్క్స్ – క్రిస్మ‌స్ 2024 అంటూ డ‌బ్బింగ్ ప్రారంభించిన విష‌యాన్ని పంచుకున్నారు మేక‌ర్స్.

Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ లో బోల్డ్ క్యారెక్టర్ చేశా..

ఇకపోతే ఆ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : కొత్త సినిమా అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్..

Exit mobile version