
వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ వేళ OTT ని నమ్ముకొని వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. ఇప్పటికే శృంగార తార మియా మాల్కోవాతో సెక్సీ ట్రీట్ తో రూపొందించిన ఈ మూవీ విడుదలైన క్షణాల్లో సంచలన వ్యూస్ రాబట్టి ఏకంగా సర్వర్ క్రాష్ అయ్యేలా చేయగా..తాజాగా నగ్నం అంటూ మరో శృంగారభరిత చిత్రాన్ని రిలీజ్ చేసి గట్టిగా సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు పవర్ స్టార్ టైటిల్ తో మరో మూవీ ని ప్రకటించి సంచలనం రేపాడు.పవర్ స్టార్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెప్పేశారు. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ మూవీ ప్రకటించిన వెంటనే.. రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్లో స్పందిస్తూ తాను హర్ట్ అయినట్లు పేర్కొన్నారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక మణిరత్నంని, ఆ తర్వాత ఆర్జీవీని అంతగా ఆరాధించేవాడినని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ”మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏవేవో చేస్తున్నారు. పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు. ఇచ్చినా తెలివిగా ఏదో చెప్పేస్తారు…నేను హర్ట్ అయ్యా” అని ట్వీట్ చేశారు.
