
మాస్ మహా రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం జూన్ 17 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాలోని బుల్ బుల్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసారు. రేపు ఉదయం 11 గంటలకు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
