Site icon TeluguMirchi.com

ఏనుగు తొండాన్ని మోసిన భల్లాలదేవ..

భల్లాల దేవా గా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా రానా..తాజాగా మరో పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల్ ముందుకు రాబోతున్నాడు. ప్రభు సోలొమన్ దర్శకత్వంలో హిందీలో ఘన విజయం సాధించిన హతి మేరె సాతి స్ఫూర్తితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హిందీ తో పటు తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు అరణ్య అని, తమిళ్ కు కాదన్ గా టైటిల్స్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కరోనా కష్టాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటె ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డానంటూ రానా చెప్పుకొచ్చారు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఏనుగుల సంరక్షుకుడిగా ఆయన పాత్ర ప్రేక్షకులకి మంచి థ్రిల్‌ కలిగిస్తుందని అంటున్నారు. అడవులలో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పటి వరకు చేసిన సినిమాల కన్నా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. నా భుజాలపై ఏనుగు తొండాన్ని మోయాల్సి వచ్చేది. ఆ తొండం బరువు సుమారుగా 160-170 కేజీల వరకు ఉండేదని చెప్పుకొచ్చాడు.

Exit mobile version