Site icon TeluguMirchi.com

అరణ్య థియేటర్స్ లలోనే వస్తుంది – రానా

భల్లాల దేవా గా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా రానా..తాజాగా మరో పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల్ ముందుకు రాబోతున్నాడు. ప్రభు సోలొమన్ దర్శకత్వంలో హిందీలో ఘన విజయం సాధించిన హతి మేరె సాతి స్ఫూర్తితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హిందీ తో పటు తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు అరణ్య అని, తమిళ్ కు కాదన్ గా టైటిల్స్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కరోనా కష్టాలు మొదలయ్యాయి.

తాజాగా రానా నటించిన అరణ్య చిత్ర నిర్మాతలు కూడా సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని టాక్ నడిచింది. అంతేగాక ఇప్పటికే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారని వార్తలొచ్చాయి. ఎలాగో థియేటర్ల లో రిలీజ్ చేసినా నష్టాలు తప్పేలా లేవు. అందుకే నష్టాల నుండి కొంతైనా ఉపశమనం పొందేందుకు అరణ్య నిర్మాతలు స్ట్రీమింగ్ ప్లాట్ఫాంలని ఆశ్రయిస్తున్నారని వస్తున్న వార్తలపై హీరో రానా స్పందించాడు. అరణ్య సినిమా ఎలాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చెయ్యట్లేదు. పరిస్థితులు బాగయ్యాక నేరుగా థియేటర్లోనే విడుదల చేస్తామని తేల్చి చెప్పారు.

Exit mobile version