
భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్ ను ఆగస్టు 08 న వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం కరోనా స్థాయి తీవ్రస్థాయి లో ఉండడం తో వివాహ వేడుక రద్దై అవకాశాలు ఉండబోతాయనే వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ సురేష్ బాబు మాత్రం అనుకున్న తేదీకే పెళ్లి జరగబోతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా మిహీకా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెళ్లికి తాను సిద్ధమవుతున్నట్టు తెలిపింది.పెళ్లి సమయంలో వేసుకునే జూటీస్ (చెప్పులు) ఫొటోను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ డిజైనర్ ఫుట్‌వేర్ సంస్థ ‘ఫిజీ గోబ్లెట్’ ఈ జూటీస్‌ను తయారుచేసింది. జూటీస్ గిఫ్ట్ ప్యాక్‌ను ఓపెన్ చేసి ఫొటో తీసిన మిహీకా.. ఫిజీ గోబ్లెట్ సంస్థకు థ్యాంక్స్ చెబుతూ ఈ పోస్ట్ చేశారు. దీనిబట్టి చూస్తే ప్రీ వెడ్డింగ్ బెల్స్ మోగిస్తున్నట్టు చెప్పకనే చెప్పింది.
